సంచికలో తాజాగా

18 Comments

 1. 1

  శ్రీధర్ చౌడారపు

  ఏం జవాబు ఉంటుంది. అందుకే నేను మల్టీప్లెక్స్ థియేటర్ లో పాప్‌కార్న్ కొనను. కొందరు చెప్పే మాటేంటంటే సినిమా టిక్కెట్లతో సమానంగా పాప్‌కార్న్ అమ్మకం ద్వారా సంపాదిస్తారంటా…. థియేటర్ యాజమాన్యం. మంచి కథావస్తువు. కథనశైలి బాగుంది

  Reply
 2. 2

  V. Naga Jyothi

  షాపింగ్ కాంప్లెక్స్ లలో, మల్టప్లక్స్ థియేటర్లలో అందంగా పేక్ పేరుతో ఘరానాగా చేసే దోపిడీల వలన జీవనోపాదికి దూరమై బతుకు భారమైన జీవితాలకి అద్దం పడుతుంది. సమాజంలో జరుగుతున్న మరిన్ని అన్యాయాలను ప్రశ్నించే తీరులో మీకలం నించి కథలు రావాలని ఆశిస్తున్నాను

  Reply
 3. 3

  పప్పు రామకృష్ణ రావు

  బాగుంది. తరాలు మారుతున్నా, చిన్న బతుకులు చిన్నగానే మిగిలిపోతుంటే, ఆ బతుకుల్లోంచే పెద్దవాళ్లు పెన్నిధి పోగు చేసుకుంటున్నారు, ఇలా multiplex లంటూ కొత్త కొత్త పద్ధతుల్లో.

  Reply
  1. 3.1

   R. S. Venkateswaran

   ధన్యవాదాలు రామకృష్ణ గారూ. నా భావం బాగా గ్రహించారు.

   Reply
 4. 4

  ఉమామహేశు పొన్నగంటి

  రవికి విడమరచి జవాబు చెప్పలేడు కిరణ్. ఇద్దరూ చిన్న వుద్యోగాలతొ బతుకు లాక్కొస్తున్న వారే. ఇదంతా ప్రపంచీకరణ ప్రభావమని, చిన్నచిన్న వ్యాపారుల పొట్ట కొట్టే విష మార్గాలని ఆ బడుగు జీవులకు తెలీదు.. తెలియనివ్వదు ఈ పాలనా యంత్రాంగం.
  కిరణ్ కోప్పడం అతని అమాయకత్వమె.

  Reply
  1. 4.1

   R. S. Venkateswaran

   నిజం ఉమామహేశు గారూ. ఇద్దరూ దోపిడీలో పావులే.

   Reply
 5. 5

  Mannava padma

  పెట్టుబడి దారుల భస్మాసుర హస్తం పడ్డ బడుగు జీవుల ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు ! ఆలోచింపజేసే కథ .

  Reply
  1. 5.1

   R. S. Venkateswaran

   సూక్ష్మంగా కథను పరిశీలించి క్లుప్తంగా రాశారు. ధన్యవాదాలు.

   Reply
 6. 6

  Mandapaka Kameswar

  లాక్‌డౌన్లో ఎంతోమంది ఉపాధికోల్పేయేరు. మల్టీప్లెక్స్ ధియేటర్లలో‌ మనల్ని బయటనించి లోపలకి ఏదీ తీసికెళ్ళనీయరు. అన్నీ అక్కడే అదనంగా కొనుక్కోవాలి. చిన్నకారు అమ్మకదారులందరూ వాళ్ళిచ్చిన యూనిఫాం వేసుకు వాళ్ళిచ్చే సరుకే ఎక్కువ ధరకు అమ్ముకు ఆలాభం మళ్ళీ ఓనరుకు అప్పజెప్పాలి. తొంభైరెండులో వేసిన ఈ ప్రపంచీకరణ ఫలితాలు, ఈ విధంగా చిన్న అమ్మకపు దార్లకు దొరుకుతున్నాయి అన్నమాట..ఈ కధ అదే చెబుతుంది..

  Reply
  1. 6.1

   R. S. Venkateswaran

   ధన్యవాదాలు కామేశ్వరరావు గారు.

   Reply
 7. 7

  శాంతా దేవి

  చాలా సున్నితమైన విషయం బాగా వ్రాసారు వెంకటెస్వరన్ గారూ. మీ పరిశీలన బాగుంది. మనిషి సహజం గా స్వార్ధ పరుడు. ఆ స్వార్ధం లో రాక రకాల రూపాలు. కొందరు తమ స్వార్ధం చూసుకుంటూ ఇంకొందరికి సహాయ పడతారు కిరణ్ లాంటి వాళ్ళు. కొందరు ఇతరుల గురించిన ప్రమేయం లేకుండా తమ స్వార్ధం చూసుకుంటారు.థియేటర్ యజమాని లాంటి వాళ్ళు. మామూలు సినిమా హాలు మార్చి ముల్తిప్లెక్ష్ చెస్తె అతని లాభాల్య్ పెరుగుతాయి. మరి అప్పుడు పాప్ కార్న్ కూడా రూపాంతరం చెందుతుంది కదా.
  ముల్తిప్లెక్ష్ కాబట్టి టిక్కెట్ ఖరీదు ఎక్కువయి, తమ ఎంటర్టైన్మెంట్ కోడం వున్న అవకాశం పోగొట్టుకున్న సగటు ప్రేక్షకులు కూడా అలా నష్థపొయిన వారే. ఇదే ప్రపంచపు తీరు .
  ఎనీవే కథ బాగుంది.
  అరన్ గారూ.

  Reply
  1. 7.1

   R. S. Venkateswaran

   ధన్యవాదాలు శాంత గారు.

   Reply
 8. 8

  వంశీ క్రిష్ణ

  ఐదు రూపాయలు ఖరీదు చేసే కోడి గుడ్డు కూడా ఆ వ్యాపార ప్రదేశాన్ని బట్టి 50 రూపాయలౌతుంది.. ఇప్పుడెవరూ సినిమా ధియేటర్ లోపల పొట్లాల అమ్మకాలను అనుమతించటం లేదు..కాలం మారింది.. మూవీ ధియేటర్లో పనిచేసే కార్మికుల జీవనం ఇంకా అథ్వాన్నంగా ఉంది.. వారితో మాట్లాడితే మరిన్ని ద్రవింపచేసే కథలు పుట్టుకొస్తాయి… కథనం బాగుంది.. ధన్యవాదాలు.

  Reply
  1. 8.1

   R. S. Venkateswaran

   వంశీ గారూ నిజమే.రవి ప్రశ్న వేశాడు తనదైన పరిధిలో. మనం అది కూడా చేయటం లేదు. స్పందనకు ధన్యవాదాలు.

   Reply
 9. 9

  Karlapalem

  జవాబు ‘ లేని ‘ ప్రశ్న కాదేమో! జవాబు ‘ ఇవ్వని ‘ ప్రశ్న – అంటే సబబేమో! అక్రమంగా లాభాలు ఆశించే వాడిని బాధితుడు ‘ ఇదేమని ‘ ప్రశ్నిస్తే జవాబు వస్తుందా? రేఫిల్స్ విమానాల డీల్ ను హెచ్చేయల్ నుంచి గుంజుకుని రిలయన్స్ అంబానీ కిస్తే నిలదీసి అడిగిన వాళ్లెందరు ? లార్జ్ కేన్వేస్ మీద చిత్రించవలసిన ఓ ‘అబ్స్ట్రాక్ట్’ రూపాన్ని రచయిత డ్రాయింగ్ బుక్ లో ఓ లైన్ డ్రాయింగ్ రూపంలో గీసే ప్రయత్నం చేశారు..ఎఫెక్టివ్ గా ! అభినందించడం అవసరం. ప్రశ్మించేవాళ్లు తగ్గుతున్న క్రమాన్ని కూడా తన దైన తాత్విక కోణంలో మరో కథ ద్వారా ప్రయత్నిస్తారని ఆశిస్తా!

  Reply
 10. 10

  karlapalem

  జవాబు లేని ప్రశ్న కాదేమో! జబాబు ఇవ్వని ప్రశ్న. రేఫిల్ డీల్స్ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి సన్నాసుల జేబుల్లోకెళ్లి దూరినట్లు .. పాపం రవి ‘ పాప్ కార్న్ ‘ థియేటర్ వెనకున్న అదృశ్య శక్తి హస్త గతమయిపోయింది! ఈ తరహా పరిస్థితులను గతంలో కొద్దిమందైనా ప్రశ్మించేవాళ్లు. ఇప్పుడా ‘ ప్రశ్న ‘ లు కూడా అమ్ముడవుతున్నాయి. లేదా గమ్మున వూరుకుంటున్నాయి. లార్జ్ కేన్సేస్ మీద చిత్రించదగ్గ అబ్ స్ట్రాక్ట్ ఫాం రచయిత ప్రతిభావేశం వల్ల డ్రాయింగ్ బుక్ మీదైనా ఎఫెక్టివ్ గా వచ్చింది. అభినందనలు , ప్రశ్నల ఉనికి తరుగుతోన్న వైనాన్ని కూడా రచయిత మరో కథలో ‘ తాత్విక ‘ కోణంలో ( బాహ్యావరణం దాటి ) పర్యాలోచన చేస్తే చదవాలనే అలోచన ఉంది. రేపటి కథలకు అవసరమైన వస్తువు మన చుట్టూతానే చాలా పేరుకుపోతోవుంది. ఉదా: మారుతున్న స్త్రీ – పురుష సంబంధాలు ; కుటుంబ వ్యవస్థల్లో వస్తోన్న విపరిణామాలు ; బాలల్లో పెరుగుతోన్న అదుపులేని కాంక్షాపరత్వాలు; సమాచారమాధ్యమాల పడుపు వృత్తి నైజాలు .. జనావళికి బాధ్యత వసించవలసిన అధికార గణాల స్వార్థ పూరిత అనై తిక ప్రభు దాస్యబుద్ధి .. ఇలా ఎన్నైనా! ఈ కథానికలో రచయిత వాడుకున్నవృథా వర్ణన లేని శైలి అభినందనీయం. ఇటీవల ‘ డోలోడు’ అనే ఓ కథానిక చదివాను. తరాల నుంచి సంప్రదాయంగా వచ్చే పీర్ల పండక్కు డోలు మోగించే వృత్తుల వాళ్ల మధ్య నేటి తరాల మీదుండే వ్యాపార సంస్కృతి ప్రభామ పడి రెండు బడుగు వర్గాల మధ్య ఎంతలా కక్షలు పెరిగి గెలుపు కోసం ఎంతలా శ్రమిస్తాడో మనస్తత్య కోణంలో అధ్భుతంగా చిత్రించాడు రచయిత ( పేరు గుర్తు లేదు ) ఆ తరహావే తమవై న వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యాపకాలలో ఉండే ప్రత్యేక అంశాలను వస్తువుగా తీసుకుని కథలకు ప్రయత్నిస్తే ‘ నలుగురితో నారాయణ’ లా కాకుండా వైవిధ్యమైన రచాయితగా కథాసాహిత్యలక్ష్మికె మరన్ని కొత్త సొమ్ములు సమకూర్చవచ్చేమో.. ఆలోచించాలని మనవి. సమాజాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తున్న వ్యాపారసంస్కృ తి బడుగుమనిషి జీవితం మీద చూపించే దుష్ప్రభావాన్ని తాజా ‘ పాపకార్న్ లా పాఠకుల చేత తినిపించిన శ్రీ వెంకటేశన్‌ గారికి అభినందనలు! 💕💐

  Reply
 11. 11

  Venugopal

  Don’t have telugu script, excuse for that.

  As others said in above comments….. the world has become a place of loot by the wealthy, especially for those below the lower middle or above poverty line. Questioning has become a sin….. as rightly said in the ” Rafeal deal”.

  All said and done nobody can question a government having majority with muscle power.

  Those who question will end up nowhere…..

  Coming back to the story…. nicely narrated …the boy “Ravi” in the story questions the obvious without digesting the fact that old cinema hall to Multiplex itself is the way to make loot in ” Common man’s entertainment” with the colour of modernity…

  Reply
  1. 11.1

   R. S. Venkateswaran

   Thank you for your comments.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: